NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మఠంలో ఘనంగా మధ్వనవమి వేడుకలు

1 min read

స్వర్ణరథం పై ఊరేగిన మధ్వాధీశులు

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో  మధ్వ నవమి వేడుకలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా మధ్వ నవమి వేడుకలు పురస్కరించుకుని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి విశేష క్షీరాభి శేకం, ఫల పుష్పాభి శేకం నిర్వహించారు. అనంతరం మధ్వాధీశుల చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు . శ్రీ మూల రామ దేవతలకు ప్రత్యేక విశేష అభిషేకాలు చేసి దూప దీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి స్వర్ణ కవచాలు, విశేష పుష్పాలంకరణ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా గ్రామ దేవత శ్రీ మంచాలమ్మను దర్శించుకుని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.  మఠం ప్రాకారంలో స్వర్ణ రథంలో మధ్వాచార్యుల చిత్రపటాన్ని ఉంచి అశేష భక్తుల హర్షద్వనుల మధ్య, మహిళా భక్తుల కోలాటాలు, భజనమండలి సభ్యుల కీర్తనలు, మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఊరేగించారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు భక్తులకు ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. మధ్వనవమి  సందర్భంగా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత పండిత కేసరి డాక్టర్ రాజా యస్ గిరియాచార్యులు , మేనేజర్ వెంకటేష్ జోషి , సహయ మేనేజర్ ఐపి నరసింహ మూర్తి , పిఆర్వో హోనలి వ్యాసరాజాచార్ , పురాణిక్   బిందుమాధవ్ , జయతీర్థస్వామి , మఠం అధికారులు పాల్గొన్నారు.  తదితరులు ఉన్నారు.

About Author