మంత్రాలయం లో ఘనంగా మట్టల పండుగ
1 min read
మంత్రాలయం , న్యూస్ నేడు : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం సీఎస్ఐ చర్చి లో ఆదివారం ఫాస్టర్ రెవరెండ్ వేదనాయకం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మట్టలను చేతిలో పట్టుకుని ఎస్సీ కాలనీలో ఉరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు యేబు, సుందర్ రాజు, దేవదాసు, ప్రభుదాస్, కుమార్, కయ్యూన్ తదితరులు పాల్గొన్నారు.