ఆలూరులో చెమ్మనూరు బ్యాంక్ గ్రాండ్ ఓపెనింగ్..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/3-10.jpg?fit=550%2C725&ssl=1)
బ్యాంక్ ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా కర్నూలు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు పట్టణంలో బళ్లారి రోడ్డు రాఘవేంద్ర డిగ్రీ కాలేజ్ పక్కన కాంప్లెక్స్ పైన కొత్తగా చెమ్మనూరు గోల్డ్ లోన్ బ్యాంక్ ఓపెన్ చేశారు.ఈ బ్యాంకు ఓపెనింగ్ కు బ్రాంచ్ మేనేజర్ మల్లికార్జున ఆహ్వానం మేరకు చీఫ్ గెస్ట్ టిడిపి జిల్లా తెలుగు యువత లీడర్ సురేంద్ర నాయుడు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చెమ్మనూరు బ్యాంకును ప్రారంభించారు..అనంతరం సురేంద్ర నాయుడు అన్నగారు,రిటైర్డ్ వార్డెన్ అనంతసేనం , రిటైర్డ్ టీచర్ రామలింగయ్య ,ఆలూరు బ్రాంచ్ మేనేజర్ మల్లికార్జున ,సిబ్బంది చింతకాయల తాయప్ప, చైతన్య, విశ్వనాథ్, వారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సురేంద్రనాయుడు అభిమానులు, పలువురు టిడిపి నాయకులు.యువత, పట్టణ మహిళలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.