రాళ్ల కొత్తూరు తాండ గ్రామంలో ఘనంగా పెద్దమ్మ జాతర
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం రాళ్ల కొత్తూరు గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి పెద్దమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసానిరామిరెడ్డినియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి గారు అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరు పాల్ రెడ్డి హాజరయ్యి అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మేల తాళాలతో పూలమాలలతో ఘనంగా గ్రామంలోకి స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానులు కాటసాని అభిమానుల పిలుపుమేరకు వారి స్వగృహాలకు వెళ్లి వారు అందించిన తేనెటీ విందుని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో తమ్మడపల్లె గ్రామపంచాయతీ సర్పంచ్ యన్నం వెంకటరామిరెడ్డి, మాజీ సర్పంచ్ మధు నాయక్, ఈశ్వర నాయక్, ఉమ్మడి జిల్లాల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గోపవరం గోపాలరెడ్డి, రాళ్ల కొత్తూరు తాండ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గోవిందు నాయక్, లక్ష్మానాయక్, దేవా నాయక్, వెంకటేష్ నాయక్, బాలుడు నాయక్, తుకారాం నాయక్, కుమార్ నాయక్ రాళ్ల కొత్తూరు గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మల్లి రెడ్డి, శివుడు, సుబ్బారెడ్డి, రాళ్ళకొత్తూరు, రాళ్ల కొత్తూరు తాండా గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డిమాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గం లోని ప్రజలందరూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతోఉండాలనిమంచిపాడిపంటలు పండి రైతులు ఆనందంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగిందని చెప్పారు. అమ్మవారికరుణాకటాక్షాలుతమనియోజకవర్గంలో ప్రజల అందరి మీద ఉండాలని చెప్పారు.