మహానంది క్షేత్రంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
1 min read
పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో ఘనంగా రథసప్తమి వేడుకలను శనివారం నిర్వహించారు. క్షేత్రంలోని రధశాల యందు ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఉదయం చేపట్టారు శాస్త్ర యుక్తంగా వేద మంత్రోచ్ఛరణలు మంగళ వాయిద్యాల మధ్య రథసప్తమి వేడుకలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ మహేశ్వర రెడ్డి దంపతులు ఏఈఓ మధు ఆలయ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు వేద పండితులు రవిశంకర్ అవధాని నాగేశ్వర శర్మ శాంతారామ్ బట్ పాలకమండలి సభ్యులు జి మల్లికార్జున ఇతర సభ్యులు పాల్గొన్నారు.
