PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సంక్రాంతి సంబరాలు

1 min read

పల్లెవెలుగు, వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో శ్రీ ప్రగతి హైస్కూలు నందు విద్యార్థిని విద్యార్థులు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు, పతంగులు ఎగుర వేయడం ,చిన్నారుల పైన రేగు పండ్లు వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల లో జరిగిన కార్యక్రమానికి హాజరైన కరెస్పాండెంట్ శ్రీమతి శకుంతల మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలలో సాంస్కృతిక సంప్రదాయాలు అలవడతాయని,పండుగల విశిష్టత తెలులుస్తుందని,సామూహికంగా అందరూ పాల్గొనడం ద్వారా మంచి అలవాట్లు ఏర్పడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్ధి నులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు k. రామారావు, టీచర్లు మురళి కృష్ణ, రామసుబ్బయ్య,శ్రీధర్, సంజీవయ్య,శ్యామలమ్మ, షెహనా,అనిత మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author