ఘనంగా సంక్రాంతి వేడుకలు
1 min read– శ్రీ భాస్కర నందీశ్వర స్వామి, శ్రీ సత్య నారాయణ స్వామి గ్రామోత్సవం
– పారువేట పరుగు పందెంలో గెలపొందిన యువకులకు బహుమతుల ప్రధానం
పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండలంలోని ఆయా గ్రామాలలో సంక్రాంతి పర్వదినం వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మండల కేంద్రమైన రుద్రవరంలో శ్రీ భాస్కర నందీశ్వర స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు పల్లకీలలో కొలువు తీరగా ఆలయాల నిర్వాహకులు అంగరంగ వైభవంగా పారువేట నిర్వహించి అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు భక్తాదులు పల్లకిలో కొలువుదిరిన ఉత్సవమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భాస్కరమందీశ్వర స్వామి ఆలయం తరఫున అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం తరఫున సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన పారువేట పరుగు పందాలలో యువకులు పాల్గొన్నారు. రెండు దేవాలయాల తరఫున రెండు విడుతలగా నిర్వహించిన పరుగు పందాలలో గెలుపొందిన యువకులకు నిర్వాహకులు గ్రామస్తులు బహుమతులు ప్రధానం చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నకంబలూరు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో కొలువైన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఉత్సవమూర్తులను గ్రామోత్సవం నిర్వహించగా భక్తాదులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.