జడ్పిహెచ్ పాఠశాలలో ఘనంగా సరస్వతి పూజ
1 min read
పల్లెవెలుగు , హొళగుంద: హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ ఆధ్వర్యం లో ఘనంగా సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది. వివిధ పరిమళ పుష్పాలతో సరస్వతి దేవి విగ్రహాన్ని అందంగా అలంకరించారు. స్కూల్ చైర్మన్ ద్వారకానాథ్ ఆచారి, పదవ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయునీ ఉపాధ్యా యులు అందరూ విచ్చేసి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలురావాలని కోరుకు న్నారు. అనంతరం ప్రధానో పాధ్యాయుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాం తంగా రాయాలని, కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని కోరారు. పట్టుకుంటే సరస్వతీ కటాక్షం లభించి చదువు, జ్ఞానం ప్రాప్తిస్తాయన్న విశ్వాసం వేల సంవత్స రాల నుంచి భారతీయ సమాజంలో వ్యాపించి వుంది. ఈ పూజ చేయడం వలన విద్యార్థుల అందరికీ సరస్వతి దేవి అనుగ్రహం ఉంటుంది. అందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకు రావాలన్నారు. . ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యా యునీ, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.