PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు:   మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.మండల కేంద్రంతో పాటు పీరు సాహెబ్ పేట,సుంకేసుల,జలకనూరు తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.పలు పాఠశాలల్లో విద్యార్థులు గోపిక,కృష్ణుల వేషధారణలతో అలరించారు.చిన్నారులతో ఉట్టిలు కొట్టడంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక వేణు గోపాలస్వామి ఆలయంలో యాదవులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేణుగోపాలస్వామికి ఫల పంచామృతాభిషేకాలు గోపూజ తదితర పూజలను నిర్వహించారు.   సనాతన ధర్మానికి ఆదర్శప్రాయ గ్రంధమైన గీతా సారాంశాన్ని అందించిన అనంతరం భక్తులు శ్రీకృష్ణుడికి పల్లకిసేవ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యాదవ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

 

About Author