PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా వేలాంగణి మాత తిరుణాల మహోత్సవాలు

1 min read

– మరియతల్లి ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి

– దివ్య బలిపూజను సమర్పించిన మోన్ సిగ్నోర్ చౌరప్ప

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు పట్టణంలోని కర్నూలు రహదారిలో ఉన్న వేలాంగణి మాత దేవాలయంలో జరిగిన వేలాంగణి మాత తిరుణాల మహోత్సవ వేడుకలు నందికొట్కూరు విచారణ గురువులు ఫాదర్ కేడి జోసెఫ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈనెల 1వ తేదీ నుంచి పదవ తేదీ వరకు గత పది రోజులుగా ఈ దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.చివరి రోజున కావడంతో భక్తులు, పిల్లలు మహిళలు యువకులు మ్రొక్కుబడులు ఉన్నవారు సుదూర ప్రాంతాల నుంచి ఉదయం నుండే దేవాలయంలో మరియ తల్లి దగ్గర ప్రత్యేకంగా ప్రార్థన నిర్వహిస్తూ టెంకాయలు కొడుతూ క్రొవ్వొత్తులు వె లిగిస్తూ వారి వారి కోరికలను మరియు విన్నపాలను మరియతల్లికి సమర్పించారు.సాయంత్రం ఆర్.సి.యం కర్నూలు మేత్రాసన పాలనాధికారి మోన్ సిగ్నోర్ చౌరప్ప దివ్య బలి పూజను సమర్పించి ప్రత్యేకంగా వాక్య పరిచర్య చేశారు.ఈసందర్భంగా గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఏడాది కూడా ఎక్కడెక్కడి నుంచో దూరప్రాంతాల నుంచి ఈ రోజున ఇక్కడికి వచ్చి మరియ తల్లిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది అదే విధంగా మీలో ఏమేమి కోరికలు ఉన్నాయో అదేవిధంగా సమస్యలు బాధలు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం తదితర వాటి గురించి ఇక్కడ మరియ తల్లికి మీరు సమర్పిస్తూ ఉండడం వల్ల ఎంతోమందికి వారి బాధలనుండి విముక్తి పొందారు అదేవిధంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉండడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు.అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా దేవుని అడుగుజాడలలో నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని,విద్వేషాలకు పగలు ప్రతీకారాలకు దూరంగా ఉండాలని ఆయన వాక్యపరిచేశారు.అనంతరం క్రీస్తు శరీరం(దివ్య సత్ప్ర సాధ అప్పాన్ని) భక్తాదులకు విచారణ గురువులు అందజేశారు.అనంతరం రాత్రి జరిగిన పిల్లలు మరియు పెద్దలు యువకులు రాత్రంతా చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి.తర్వాత పూజా కార్యక్రమం అనంతరం నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్ మరియ తల్లి ఆయన జీవితంలో చేసిన మేలుల గురించి ఎమ్మెల్యే సాక్ష్యం చెప్పారు.ఈ తిరుణాలకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రావడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అదే విధంగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పట్టణ సీఐ విజయభాస్కర్ మరియు ఎస్ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో కర్నూలు డీన్ కో కతిడ్రల్  గురువులు కాకర్ల అంతోని రాజ్,జీవసుధ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు,కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ సుధాకర్,ప్రేమగిరి విచారణ గురువులు ఫాదర్ సతీష్,వివిధ విచారణ గురువులు మరియు నందికొట్కూరు సహాయ గురువు ఎస్.రవి,ఉపదేశులు మరియు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

About Author