NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెడ్ క్రాస్ సొసైటీ కి గ్రంధి అమరేంద్ర 50 వేలు విరాళం..

1 min read

– సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా దాతలు సహాయపడాలి..

– చైర్మన్ బి.వి కృష్ణారెడ్డి

పల్లెవెలుగు వెబ్  ఏలూరు  : ఏలూరు వైభవ్ జువెలరీస్ అధినేత గ్రంధి అమరేంద్ర రెడ్ క్రాస్ సొసైటీ కి విరాళంగా 50 వేల రూపాయల చెక్కును జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బి.వి కృష్ణారెడ్డికి ఆదివారం అందజేశారు.ఈ సందర్భంగా గ్రంధి అమరేంద్ర మాట్లాడుతూ నిర్విరామంగా రెడ్ క్రాస్ సొసైటీ చేసే సేవా కార్యక్రమాలు వెలకట్టలేని వని తమ వంతుగా ఈ విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు. చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ  పారిశ్రామిక వ్యాపారవేత్తలు ఎవరైనా రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ కి అవసరమైన పరికరాలను సిఎస్ఆర్ ఫండ్ క్రింద సమకూర్చవలసిందిగా కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ విరాళం అందజేసిన గ్రంధి అమరేంద్ర, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త ఉషా బాలకృష్ణ గ్రూప్స్ ఉషా బాలకృష్ణ, బడేటి చంటి, డాక్టర్ దొంతం శెట్టి బసవరాజు, రెడ్ క్రాస్ ట్రెజరర్ రేవూరి శివప్రసాద్, బి.పద్మజావాణి, డాక్టర్ ఆర్ఎస్ఆర్కె వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

About Author