PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా పెద్దమ్మ అవ్వ జాతర ఉత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఉప్పర వాళ్ళ కట్ట దగ్గర వెలసిన పెద్దమ్మ అవ్వ 11వ వార్షికోత్సవ జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పెద్దమ్మకు కుంకుమార్చన, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుండి పెద్దమ్మకు బోనాలతో భక్తాదులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. పట్టణ ప్రముఖులు జాతర ఉత్సవాల్లో పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు .అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు.


About Author