NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుంద మండలంలో ఇండోర్ స్టేడియం మంజూరు చేయండి

1 min read

– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షాప్ ఛైర్మెన్ భైరెడ్డి సిధ్ధార్ధ్ రెడ్డిని కలిసిన హోళగుంద యువ నాయకులు

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  ఆలూరు నియోజకవర్గం పరిధిలోని మన హోళగుంద మండలంలో చాలామంది యువకులు క్రికెట్,కబడ్డీ,చెస్సు,వాలిబాల్,షాట్ పుట్ ఇతర ఆట పోటీలలో రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళి సరైన శిక్షణ లేక పోవడం వలన రాష్ట్ర స్థాయి వరకు వెళ్లిన యువకులు నిరాశతో వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది.కావున దేశంలో ఎంతో పతిష్టాత్మక అయినటువంటి ఆటలలో యువకులు ముందుకు సాగి మన రాష్ట్రానికి పేరును తీసుకుని రావడానికి మీలాంటి నాయకుల సలహా సహాకారం ఎంతో అవసరం వున్నది. అందుకని తమరు దయవుంచి హోళగుంద మండలంలో సర్వే నెంబర్ 361 ప్రభుత్వ స్థలం 14 ఎకరాలు కలదు కావున ఆ ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఇండోర్ స్టేడియంను మంజూరు చేసి మన హోళగుంద మండలంలో వున్న యువకులకు న్యాయం  చేయాలనీ వినతి పత్రం ద్వారా కోరుతూ హోళగుంద మండల యువ నాయకులు ఎల్లార్తి అర్జున్, తిక్కస్వామి,రమేష్,మహేష్, బసవ,మధు తదితర యువ నాయకులు పాల్గొన్నారు. అందుకు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా నేను హోళగుంద మండలానికి ఇండోర్ స్టేడియంను మంజూరు చేయుటకు నావంతుగా కృషి చేస్తాననీ హామి ఇవ్వడం జరిగింది.

About Author