పిఎంఇజిపి లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయండి..
1 min readఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులను సింగిల్ విండో పధకంలో నిర్దేశిత సమయంలో ఆమోదించాలి..
26 పరిశ్రమలకు రూ:1.50 కోట్ల రూపాయల రాయితీ మంజూరు
జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పిఎంఇజిపి లబ్దిదారుల దరఖాస్తులను తిరస్కరించకుండా రుణాలు మంజూరు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులతో బ్యాంకర్లు సమన్వయము చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ బ్యాంకర్లకు సూచించారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ హాలులో శనివారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పధకాలు మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని , అందుకు తగిన విధంగా అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పిఎంఇజిపి లబ్దిదారులకు సంబందించిన 438 దరఖాస్తులను రుణాలు అందించేందుకు బ్యాంకర్లకు పంపించగా, వాటిలో 171 దరఖాస్తులను వివిధ కారణాలతో బ్యాంకర్లు తిరస్కరించడం, మరో 177 దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంపై కలెక్టర్ స్పందిస్తూ దరఖాస్తులో ఏమైనా లోటుపాట్లు ఉంటె వాటిని సరిదిద్దుకునేలా ధరఖాస్తుదారులు తెలియజేయాలన్నారు. అదేవిదంగా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయము చేసుకుని, లోటుపాట్లు సరిచేసి రుణాలు మంజూరు చేయాలనీ బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పారిశ్రామికాభివృద్ధికి అమలు చేసున్న పధకాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు, దరఖాస్తు విధానం, తదితర అంశాలపై జిల్లా పరిశ్రమల కేంద్రం మరియు గ్రామ స్థాయిలో కూడా కలిగేలా ఫ్లెక్సీలు ద్వారా అవగాహన కలిగించాలని జిల్లా పరిశ్రమల కెంరం జనరల్ మేనేజర్ ఆదిశేషు ను కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగే విండో పధకం ద్వారా 271 దరఖాస్తులు అందగా , వాటిలో 255 దరఖాస్తులు వివిధ శాఖల ద్వారా ఆమోదించడం జరిగిందన్నారు. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశించిన సమయంలోగా ఆమోదించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొల్లేరు ప్రాంతం లోని ఎకో సెన్సిటివ్ జోన్ బయట కాలుష్యం లేని పరిశ్రమల స్థాపనకు ఆ ప్రాంతంలోని యువతకు అవగాహన కలిగించి, ఆ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధి పాలసీ కింద జిల్లాలోని 26 ఎం ఎస్ ఎం ఈ, వై.ఎస్.ఆర్. బడుగు వికాసం యూనిట్లకు కోటి 50 లక్షల రూపాయల వివిధ ప్రోత్సాహకాలను మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం ఆదిశేషు, ఎపిఐఐసి జెడ్ఎం బాబ్జి, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ సాల్మన్ రాజు, డిపిఓ టి. విశ్వనాథ్ శ్రీనివాస్, ఎల్ డిఎం నీలాధ్రి, ఉప రవాణా కమిషర్ శాంతి కుమారి, కాలుష్యనియంత్రణ మండలి అధికారి రమేష్ కుమార్, ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ బాపిరాజు, డి టి సి పి అధికారి చంద్రశేఖర్, పరిశ్రమల శాఖ ఏ డి సుమధురవాణి, తదితరులు పాల్గొన్నారు.