సాగు భూములకు పట్టాలు మంజూరు చేయండి.. బీఎస్పీ పార్టీ
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఎన్నో సంవత్సరాల నుండి రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని బీఎస్పీ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి ఎల్ స్వాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . సోమవారం స్పందన కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో దాసు గారికి వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ఎంతో మంది పేద రైతులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు .అయితే ఆ భూముల ను వ్యవసాయ అధికారులు పంటమాస్పరి రాసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా సాగు చేసుకుంటున్న భూములకు ఎలాంటి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయకుండా ఎన్నో ఏళ్ల నుంచి రైతులు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న మంజూరు చేయడం లేదని. ప్రభుత్వం భూమి సాగు చేసుకున్న పేద రైతులకు అసైన్మెంట్ ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కిందిస్థాయి రెవిన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని సాగులో ఉన్న ప్రభుత్వ భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.