ఎమ్మెల్సీ మధుసూదన్ కు ఘన సన్మానం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణం లో రబ్బానీ కాంప్లెక్స్ లో నందికొట్కూరు ఎమ్మెల్యే తోగుర్ అర్థర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మధుసూదన్ ను నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ, కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుస్సేన్, ఉండవెల్లి ధర్మారెడ్డి లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డా. మధు సూధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగనన్న ఆశీస్సులతో గెలుపొందానని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం నేను పుట్టిన గడ్డ అని నియోజకవర్గాన్ని ఎప్పటికి మారువలెనన్నారు. నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైకాపా పార్టీకి చెందిన నేతలు దుశ్శాలువ, పులమాలతో సన్మానించారు.అనంతరం నందికొట్కూరు పట్టణ పాత్రికేయులు ఎమ్మెల్సీ డా. మధుసూదన్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో 6వ వార్డ్ ఇంచార్జి దేశెట్టి శ్రీనివాసులు,కడుమూరు గోవర్ధన్ రెడ్డి,పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి వనజ,పట్టణ వైస్సార్సీపీ నాయకులు రిటైర్డ్ ఎస్ ఐ జాన్ , తమ్మడపల్లి విక్టర్, ముజీబ్,పఠాన్ రసూల్ ఖాన్, వైస్సార్సీపీ సోషల్ మీడియా కో-కన్వీనర్ పసుల శ్రీనివాసులు నాయుడు, అబ్బాస్,ఆఫ్రిద్, చంద్ బాషా తదిరులు పాల్గొన్నారు.