కౌతాళంలో ఘనంగా యుగపురుషుడు ఎన్టీఆర్ వర్ధంతి
1 min readఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పాలకుర్తి దివాకర్ రెడ్డి ,చెన్నబసప్ప దని ,వెంకటపతిరాజు
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండల కేంద్రమైనటువంటి కార్యక్రమం నిర్వహించగా తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప దని , తెలుగు రైతు జిల్లా కార్యదర్శి క్లస్టర్-3 ఇంచార్జ్ అల్లూరి వెంకటపతి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు తెలుగుయువత జిల్లా కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మి ప్రజలందరికి కూడు,గూడు,గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని అన్నారు, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించి,బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు,మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు, ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు టిప్పు సుల్తాన్ , బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు ,ఆర్.ఎం.పి డాక్టర్ సెల్ అధ్యక్షులు రాజనంద్ ,దమ్ములదీన్ని రమేష్ గౌడు,బాపురం వెంకట్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రాజబాబు,ఉరుకుంద సురేంద్ర, ఎరిగేరి బసవరాజు,సిహెచ్ రమేష్, కౌతాళం గోవిందు, గాబ్రీల్, బదినే హాల్ ఉమేష్,వీరేష్, ఏరిగేరి స్వామి, గడిగె రమేష్,రంగస్వామి, కురువ బసన్న, గోవిందు, హరి, స్వామి దాసు,ఐటిడిపి ఎరిగేరి వీరేష్,దిద్ది ఉసెని తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.