PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత మెడికల్ క్యాంప్ కి విశేష స్పందన

1 min read

పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం : శ్రీశైలం మాజీ MLA బుడ్డా రాజశేఖరరెడ్డి గారు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ కి ప్రతి ఒక్కరు ఉత్సహంగా పాల్గొంటున్నారని ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ పట్టణంలోని రహమత్ నగర్ ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ అధినేత శాంతిరాముడు గారి పర్యవేక్షణలో చిన్నపిల్లలకు ప్రత్యేకంగా E.N.T స్పెషలిస్ట్ లు చికిత్స చేసి మందులు పంపిణీ చేశారు. పెద్ద వారికి కంటి పరీక్షలు, గుండెకు సంబంధించిన E.C.G, కీళ్ల నొప్పులకు, జ్వరం, బీపీ, షుగర్ టెస్టులు ఉచితంగా చేసి మందులు పంపిణీ చేశారు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా శ్రీశైలం మాజీ MLA బుడ్డా రాజన్న గారికి మరియు శాంతిరామ్ వైద్యశాల చైర్మన్ శాంతిరాముడు గారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మొమిన్ యూసుఫ్,అబ్దుల్ హుస్సేన్,జిలాని హాస్పిటల్ డాక్టర్స్ మహేజబీన్, భావన,శ్రీనిధి,సాచిత,సానియా, కిషోర్, రమణ,ప్రభాకర్,సుబ్రమణ్యం, ప్రసాద్,మనోజ్,గౌతమ్, రామ్ నాయక్,నూరుల్లా మరియు జిలాని బాబు పాల్గొన్నారు.

About Author