పోలీసు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే
1 min read– కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్.. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత .
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు , ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది మొత్తం 35 మంది వ్యక్తిగత హెల్త్ మెడికల్, స్పౌష్ మెడికల్ , రిక్వెస్ట్ బదిలీలు ఇతర వ్యక్తిగత కారణాల సమస్యల గురించి జిల్లా ఎస్పీ గారికి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ గారు సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు అక్కడికక్కడే తగిన పరిష్కారం భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి ప్రసాద్, డిపిఓ ఏఓ సురేష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్ పాల్గొన్నారు.