వేరు శనగ, పత్తి, మిరప రైతులను ఆదుకోవాలి..!
1 min readఎకరాకు యాభై వేల రూపాయలు తక్షణ సాయంగా ఇవ్వాలి..!
పంట పొలాలను పరిశీలించిన పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: మంత్రాలయంలో జరుగు బైక్ ర్యాలీ మరియు పబ్లిక్ మీటింగ్ కు వెళ్తూ మార్గమధ్యంలో ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆలూరు అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో హులేబీడు గ్రామం నందు వేరు శనగ పంటను పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు , ఏఐసిసి సెక్రటరీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సిడి మయ్యప్పన్ గారు కర్నూలు, నంద్యాల జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబు రావు మరియు జే లక్ష్మీ నరసింహ యాదవ్ గారు పంటపొలాలలో ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వేరుశనగ, పత్తి, మిరప రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేసిన వర్షాలు లేక ఎండిపోతున్నాయని ప్రభుత్వం తక్షణ సాయంగా ఎకరాకు 50,000/- వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు NSUI రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సాకే శంకర్, కాంగ్రెస్ పార్టీ ఆలూరు మండల అధ్యక్షులు తుంబలబీడు లక్ష్మన్న, ఎస్సీ సెల్ తాలుకా అధ్యక్షుడు ఈరన్న, తాలుకా ప్రధాన కార్యదర్శి వరకుమార్, హోలగుంద మండల మైనారిటీ నాయకులు అమానుల్లా, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, నంద్యాల జిల్లా సోషల్ మీడియా నాయకులు నరసింహ, యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పగిరి వినోద్ కుమార్, ఎస్సీ సెల్ చిప్పగిరి మండల అధ్యక్షులు ఖాజీపురం రాంబాబు, హలహర్వి మండల అధ్యక్షులు విజయ్ కుమార్, గంగాధర్, లింగప్ప, నగరడోణ శ్రీరాములు, వీరాంజినేయులు పాల్గొన్నారు.