పంపిణీకి సిద్ధంగా వేరుశనగ విత్తనాలు
1 min read– మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: మండలంలోని ఉప్పరపల్లి గ్రామపంచాయతీ లో రైతులకు 25% సబ్సిడీతో వేరుశెనగ విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మండలంలోని ఉప్పరపల్లి గ్రామపంచాయతీలో నీ గ్రామ సచివాలయంలో జేజి-11 రకం గల 15 క్వింటాల వేరుశనగ విత్తనాలు రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు, ఇవి కేజీ 64 రూపాయల.56 పైసలు కాగా 16 రూపాయల.14 పైసలు సబ్సిడీ పోను రైతుల వాటా కింద 48 రూపాయల 42 పైసలు చెల్లించి తీసుకుపోవాల్సిందిగా ఆమె తెలియజేశారు, అంతేకాకుండా ఖరీఫ్ 2022 సంవత్సరానికి గాను పంట నమోదు జాబితాను రైతు భరోసా కేంద్రాలలో సోషల్ ఆడిట్ కోసం నోటీసు బోర్డులలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు, రైతులకు సంబంధించిన పంట నమోదు వివరాలను కూడా అందులో నమోదు చేయడం జరిగిందని ఇందులో ఏవైనా రైతులకు సంబంధించిన పంటలు ఇతర వివరాలు సక్రమంగా నమోదు చేయబడ్డాయో లేదో పరిశీలించి తెలుసుకోవచ్చని ఆమె తెలియజేశారు.