PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రూప్​–2 పరీక్షలను.. పకడ్బందీగా నిర్వహించాలి

1 min read

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

కర్నూలు, పల్లెవెలుగు: జిల్లాలో ఈనెల 25 వ తేదీన నిర్వహించే గ్రూప్ 2  సర్వీసెస్ పరీక్షలను ఎలాంటి పొరపాట్ల కు తావు లేకుండా పకడ్బందీగా  నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాల ఆడిటోరియంలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో  సమన్వ య సమీక్షా సమావేశం  నిర్వహించారు.  ఈ సందర్భంగా  జాయింట్ కలెక్టర్  నారపు రెడ్డి మౌర్య మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, పారదర్శకతతో విజయవంతంగా పరీక్షలను నిర్వహించాలన్నారు.   ఈ నెల 25 వ తేదీన  ఉదయం 10:30 నుండి ఒంటి గంట వరకు OMR ఆధారంగా స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

126 సెంటర్లు…36వేల మంది అభ్యర్థులు..:

జిల్లాలో కర్నూలు నగరం, కోడుమూరు,ఎమ్మిగనూరు, ఆదోనిలోని 126 సెంటర్లలో 36 వేల మంది గ్రూప్ 2 పరీక్షలు రాస్తున్నారన్నారు. విశాఖ పట్నం తర్వాత కర్నూలు జిల్లాలోనే అధికంగా ఈ పరీక్షలు రాస్తున్నారన్నారు. 2,3 సెంటర్లకు కలిపి 34 రూట్లు గా విభజించి 34 మంది  జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగా  నియమించడం జరిగిందన్నారు.  ప్రశ్న పత్రాలను ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు . ప్రశ్న పత్రాలను, ఓఎంఆర్ సీట్ల ను, రూట్ ఆఫీసర్స్ ఉదయం 5 గంటలకు ట్రెజరీ నుండి తీసుకొని కోడ్ నంబర్ల ప్రకారం ఏ సెంటర్  కు సంబంధించిన omr షీట్ లను,ప్రశ్న పత్రాల ను ఆ సెంటర్లకు పోలీస్ సెక్యూరిటీతో తీసుకొని వెళ్లి పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ లకు అందచేయాలన్నారు.  కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు అవసరమైన మందులు, ఫస్ట్ ఎయిడ్, ఒక ఏఎన్ఎం కూడా ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షకు హాజరయ్యే గర్భిణీ స్త్రీలకు, దివ్యాంగులకు కింద ఫ్లోర్ లోనే పరీక్ష రాసే విధంగా తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు.scribe ను ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉందన్నారు.. పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు పరీక్ష కేంద్రంలో ఉండాలన్నారు. స్మార్ట్ వాచెస్, మొబైల్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించడం జరగదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం APPSC కమిషన్ డిప్యూటీ సెక్రటరీ సి కొండారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ కె శ్రీనివాసరావు మాట్లాడారు. అడిషనల్ ఎస్పీ నాగరాజు మాట్లాడుతూ కేంద్రాల వద్ద 378 మంది, రూట్ లలో 68 మంది పోలీసులతో బందో బస్త్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.  సమావేశంలో  డిఆర్ఓ కె మధుసూదన్ రావు, ఏపీపీఎస్సి సెక్షన్ ఆఫీసర్ డిల్లేశ్వరరావు,రూట్ ఆఫీసర్స్, లైజనింగ్ ఆఫీసర్, చీఫ్  సూపరింటెన్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author