NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఎదగాలి

1 min read

-ఏపీఆర్ఎమ్ జీఎం ప్రిన్సిపాల్ ప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూల్: విద్యార్తి తమ తల్లిదండ్రుల తమపై పెట్టుకున్న ఆశయాలకు అనుగుణంగా వారి కష్టాన్ని గుర్తించి, వారి ఇష్టానికి అనుగుణంగా ఉన్నతస్థాయి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని పంచలింగాల ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ పి ప్రసాద రావు కోరారు. సోమవారం పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగింది. త్వరలో జరుగనున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థినిలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని అన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల విద్యార్థినుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు అనూరాధ,ప్రేమలత, రెడ్డమ్మ, బెనజీర్ బేగం, హేమలత,ఆసియా బేగం, జ్యోతి, ఇందిరాలు పాల్గొన్నారు.

About Author