NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మొక్కలు పెంచడం.. అందరి బాధ్యత

1 min read

– వైసీపీ మండల కన్వీనర్​ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, చిట్వేలి: మొక్కలు నాటడం.. పెంచడం బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు వైసీపీ మండల కన్వీనర్​ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి. గురువారం జగనన్న పచ్చతోరణం.. వన మహోత్సవంలో భాగంగా చిట్వేలి కస్తూర్భా హైస్కూలులో ఆయన ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్యాలను అధిగమించేందుకు మొక్కలు పెంచడం తప్ప.. మరో మార్గం లేదన్నారు. కార్యక్రమంలో చిట్వేలి సర్పంచ్ ఉమామహేశ్వరరెడ్డి, రాష్ట్రకార్యవర్గసభ్యులు మలిశెట్టి వెంకటరమణ, రమణారెడ్డి,లింగం.లక్ష్మీకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షారాధా, ఫీల్డ్ అసిస్టెంట్ మోచర్ల నరసింహ, ఏ.పిడివోఎం.ఈ.ఓ,పాఠశాలసిబ్బంది పాల్గొన్నారు.

About Author