PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘సైబర్​ సెక్యూరిటీ.. దేశ వృద్ధి, సుస్థిరతకు కీలకం..!

1 min read

* సీటీవో స‌ద‌స్సులో సంస్థ ప్రతినిధులు

హైద‌రాబాద్: డీడీఐ, ఏడీసీ సొల్యూష‌న్లలో ముందంజ‌లో ఉన్న టీసీపీ వేవ్ సంస్థ.. న‌గ‌రంలోని ద వెస్టిన్ హైద‌రాబాద్ మైండ్‌స్పేస్‌లో బుధ‌వారం సీటీవో స‌ద‌స్సు నిర్వహించింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు (సీటీవోలు), చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు (సీఐఎస్‌వోలు), సైబర్ సెక్యూరిటీ నిపుణుల‌ కోసం రూపొందించిన ఈ ప్రత్యేక సమావేశంలో దేశంలోని 30 సంస్థలకు చెందిన సీటీవోలు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు సహా 40 మంది నిపుణులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా టీసీపీ వేవ్ స‌హ వ్యవ‌స్థాప‌కుడు, చీఫ్ ఇన్ఫర్మేష‌న్ ఆఫీస‌ర్ శాం పారేప‌ల్లి, చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ముర‌ళి స‌ప్ప త‌దిత‌రులు మాట్లాడుతూ,  “సైబ‌ర్ సెక్యూరిటీ అనేది భార‌త‌దేశ వృద్ధికి, సుస్థిర‌త‌కు చాలా కీల‌కం. ఈ విష‌యాన్ని టీసీపీ వేవ్ పూర్తిగా అర్థం చేసుకుని, ఈ విష‌యంలో డిజిట‌ల్ మౌలిక వ‌స‌తుల‌ను బ‌లోపేతం చేసేందుకు క‌ట్టుబ‌డి ఉంది. త‌న సృజ‌నాత్మక డీఎన్ఎస్ సెక్యూరిటీ సొల్యూష‌న్ల‌తో ప్రస్తుత డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వ్యాపారాలు స‌జావుగా సాగేందుకు వీలు క‌ల్పిస్తోంది. మ‌న దేశంలో ఆర్థిక‌, వైద్య, ఐటీ/ఐటీఈఎస్‌, రీటైల్, ప్రభుత్వ రంగాల‌కు సైబ‌ర్ ముప్పు ఎక్కువ‌గా ఉంది. ఈ ప‌రిశ్రమ‌ల‌కు సైబ‌ర్ భ‌ద్ర‌త క‌ల్పించడంలో టీసీపీ వేవ్ ప్రత్యేక‌త సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సైబ‌ర్ సెక్యూరిటీ మార్కెట్ విస్తృతంగా పెరుగుతోంది. భార‌త‌దేశం ఈ రంగంలో మంచి సేవ‌లు అందిస్తోంది. అంత‌ర్జాతీయ ప్రమాణాల‌ను అందుకోవ‌డంలో మా సంస్థ ముందుంది. అయితే ఎప్పటిక‌ప్పుడు స‌రికొత్త ముప్పులు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో ఈ రంగంలో నిపుణుల కొర‌త బాగా ఉంది. అందుకే మేం శిక్షణ కార్యక్రమాలు నిర్వ‌హిస్తూ, ఆర్ అండ్ డీ మీద కృషిచేసి ఈ స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తున్నాం. ఏఐ-ఆధారిత డీఎన్ఎస్ సెక్యూరిటీ సొల్యూష‌న్ల‌ను అందించ‌డం ద్వారా సైబర్ భ‌ద్రత‌ను పున‌ర్నిర్వచించాల‌న్నది టీసీపీ వేవ్ యోచ‌న‌. త‌ద్వారా ప్ర‌తి ఒక్కరికీ డిజిట‌ల్ ప్రపంచంలో భ‌ద్రత క‌ల్పిస్తాం. ఇక సైబ‌ర్ సెక్యూరిటీ రంగంలో హైద‌రాబాద్ ప్రమాణాలు చాలా బాగున్నాయి. ఇక్కడి నిపుణుల‌కు టీసీపీ వేవ్ పెద్దపీట వేస్తుంది. వారిని ఈ ప్రాంతంలో మంచి నిపుణులుగా తీర్చిదిద్దుతుంది” అని వారు తెలిపారు. 

About Author