PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీఎస్ఎల్ వీ మార్క్ ​- 3 కౌంట్ డౌన్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగువెబ్ : మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ నెల 23న జీఎస్ఎల్‌వీ-మార్క్‌ 3 (ఎల్‌వీ-ఎం 3) రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగే ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)వన్‌వెబ్‌ ఇండియా-1 పేరుతో యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను ఏకకాలంలో కక్ష్యలోకి పంపనున్నారు.ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశం శుక్రవారం జరగనుంది.ఈ సమావేశానికి ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రాకెట్‌ పనితీరు తదితర అంశాలను సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఎంఆర్‌ఆర్‌ అనంతరం షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ అధ్యక్షతన లాంచింగ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమావేశమవుతారు. అన్నీ సజావుగా సాగితే ఈ నెల 21న అర్ధరాత్రి తరువాత అనగా 2న 12.07గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించ నున్నారు.

About Author