రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : జీఎస్టీ వసూళ్లు రికార్డు సృష్టించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జీఎస్టీ వసూళ్లు ఆల్టైమ్ రికార్డు స్థాయిని నమోదు చేశాయి. ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.1,67,540 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో వసూలైన రూ.1.40 లక్షల కోట్లతో పోలిస్తే.. ఇది 20 శాతం ఎక్కువని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం మార్చి నెలలో రికార్డు స్థాయిలో వసూలైన రూ.1.42 లక్షల కోట్లతో పోల్చినా ఇది రూ.25,000 కోట్లు ఎక్కువ.