రోగుల పై జీఎస్టీ బాదుడు !
1 min readపల్లెవెలుగువెబ్ : కార్పొరేట్ ఆసుపత్రుల బాదుడుకు తోడు బీజేపీ సర్కార్ మరో భారాన్ని మోపింది. జూన్ చివరలో జరిగిన 47వ సమావేశంలో హాస్పిటల్ బెడ్స్‌పై 5 శాతం జీఎస్‌టీని కౌన్సిల్ సిఫార్సు చేసింది. దీని కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నేటి(జూలై 18, 2022) రూ.5 వేలకు పైగా చార్జీ ఉండే పడకలపై అదనపు భారం పడనుంది. ఐసీయూ మినహాయించి, ఆసుపత్రిలో ఒక రోగికి రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ ఉండే బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడు తప్పదు. ఇన్‌పుట్ ట్యా ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన దూరం చేయడం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి గది అద్దెపై జీఎస్టీ రోగుల ఆరోగ్య సంరక్షణ భారాన్ని పెంచుతుందని, అలాగే పరిశ్రమకు పెను సవాళ్లతోపాటు, ఆస్పత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.