PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“గుడికట్టు” సాంఘిక దురాచారం…

1 min read

– అడ్డుకోకపోతే అడుగడుగునా అవమానాలే

– బీఎస్పీ జిల్లా ఇన్చార్జిలు కాసాని నాగరాజు, కొత్తూరు లక్ష్మీనారాయణ

– రూపుమాపాలని కరపత్రాలను విడుదల చేసిన బహుజన సమాజ్ పార్టీ

పల్లెవెలుగు వెబ్  అనంతపురం  :  జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధర్మవరం మండలం మేడారం పురం గ్రామంలో జరుగుతున్న గుడికట్టు నామాలు వేసే సాంఘిక దురాచారాలను రూపుమాపాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగినది. మేడాపురం గ్రామంలో మాదిగ కులంలోనే పెద్ద మాదిగలు చిన్న మాదిగలు అని రెండు వర్గాలుగా విభజించారు. మాదిగకులంలో ఎవరైనా పెద్ద మనుషుల కట్టుబాట్లను మరియు వారి అనుమతి లేకుండా వివాహం చేసుకుంటే వారిని చిన్న మాదిగలుగా పరిగణించి, వారిని గ్రామంలో జరిగే ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా, వారిని వెలివేసి, వారికి ఉగాది పండుగ రోజున గుడిలోకి అనుమతించకుండా, వారికి నామం వేయకుండా, వారిని విభజించి, మానసికంగా వారిని వారి కుటుంబాన్ని వేధించడం మరియు వారి కుటుంబాల నుంచి మహిళలు గాని, పురుషులు గానీ వారి పిల్లలు గాని చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండే సాంప్రదాయాన్ని ప్రవేశ పెట్టి, గ్రామ పెద్దలు అనేవారు పైశాచిక ఆనందాన్ని పొందుతూ నామాలు వేసే తీవ్రమైన సాంఘిక దురాచారాలను ఆదరిస్తూ నానా రకములుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ యొక్క సాంఘిక దురాచారాలను బాగా చదువుకున్న రామకృష్ణ అనే యువకుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వ అధికారులు మేడాపురం గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సాంఘిక దురాచారాలను రూపుమాపాలని పెద్ధ మనుషులకు హెచ్చరించారు. అయినా కూడా ప్రభుత్వ అధికారుల ఆదేశాలను కూడా లెక్కచేయకుండా ఈ సంవత్సరం లోనే ఉగాది పండుగ రోజున చిన్న కులం అని ముద్రవేసిన, వారిని గుడిలోకి రానీయకుండా నామాలు వేయకుండా, దౌర్జన్యం చేసి, గ్రామస్తులను రెండు వర్గాలుగా విభజించి, గొడవలు చేసి సాంఘిక దురాచారాలను ఆచరించడం జరిగినది. ఈ యొక్క సాంఘిక దురాచారాలపై హైకోర్టులో విచారణ ఉన్నా, హైకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా గ్రామ పెద్దలు అనేవారు మూర్ఖంగా వ్యవహరించడం జరిగినది. స్థానిక పోలీసులు వారు కూడా దురాచారాలను రూపుమాపాలని ప్రయత్నం చేయకుండా, న్యాయం కోసం మాట్లాడే, పోరాటం చేస్తున్న వారిపైనే కేసులు నమోదు చేసేలా ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యతాయుతమైన వారే అశాంతికి కారణమవుతున్నారు. ఈ యొక్క సాంఘిక దురాచారాలను తీవ్రంగా పరిగణించిన బిఎస్పీ పార్టీ వారు క్లుప్తంగా కరపత్రాల రూపంలో ఈ యొక్క దురాచారాలపై కరపత్రాలను విడుదల చేయడం జరిగినది. సాంఘిక దురాచారాలను ప్రోత్సహించిన గ్రామ పెద్దలు పై జిల్లా బహిష్కరణ వేటు వేసి, నామాలు వేసే సాంఘిక దురాచారాలను ప్రోత్సహించిన ప్రభుత్వ అధికారుల పైన మరియు పెద్ద మనుషుల పైన చట్టపరమైన, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగినది. లేని యెడల బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు, ఆందోళనలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఎస్పీ పార్టీ వారు కాసాని నాగరాజు జిల్లా ఇంఛార్జి, లక్ష్మి నారాయణ జిల్లా ఇంఛార్జి, ఇందీవర్ సత్యసాయి జిల్లా ఇంఛార్జి, అంకె కుళ్లాయప్ప జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ, కంచె గోపాల్ అనంతపురం నియోజకవర్గం కన్వీనర్, హరిప్రసాద్ అధ్యక్షులు, నాగరత్నమ్మ కోశాధికారి, తూర్పింటి ఓబులేసు రాప్తాడు ఇంచార్జి, గవ్వల ఓబులేసు సీనియర్ నాయకులు, బికెయస్ ఆనంద్, తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు.

About Author