గుడివాడ క్యాసినో వివాదం.. గవర్నర్ వద్దకు టీడీపీ !
1 min read
పల్లెవెలుగువెబ్ : గుడివాడ క్యాసినో వివాదం పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గవర్నర్ ను కలవనుంది. ఉదయం 11.30 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్‌ను కలవనుంది. గుడివాడలో జూదం నిర్వహించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కేసినోపై కరపత్రాలు, ఆధారాలను టీడీపీ కమిటీ గవర్నర్‌కు సమర్పించనుంది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు కోరనున్నారు. టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి.