NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీలో చేరిన గూడురు స్వతంత్ర అభ్యర్థి..

1 min read
  • మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతు
    పల్లెవెలుగు వెబ్​, గూడురు: గూడూరు నగర పంచాయతీ 17 వార్డులో బీజేపీ మద్దతుతో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి మండ్ల బజారి మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మీసాల ప్రేమ్ కుమార్ సమక్షంలో కాశయ ఖండువా కప్పుకున్నారు. మరో ఇండిపెండెంట్​ అభ్యర్థి బీజేపీకి మద్దతుగా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పొలంకి రామస్వామి, రాష్ట్ర మీడియా ప్రతినిధి సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య మాట్లాడుతూ మోదీ పాలన అభివృద్ధి నచ్చి భాజపా లో చేరేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కాళింగి నరసింహ వర్మ, వెంకటహరి, కోడుమూరు నియోజకవర్గ నాయకులు వేల్పులగోపాల్, ధర్మజాగరణ జిల్లా నిధి ప్రముఖ్ డమాం సురేష్, గూడూరు మండల అధ్యక్షులు మల్లేష్ నాయుడు, యువనాయకులు మధు, గణేష్,లక్షన్న, శివరాముడు రాము, హరి, వెంకటేష్,రమేష్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

About Author