మల్లన్నను దర్శించుకున్న గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి
1 min read
పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: శ్రీశైలక్షేత్రాన్ని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎం.ప్రచాక్, గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఉభయదేవాలయాల్లో స్వామిఅమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు. స్వామిఅమ్మవార్ల సేవార్థం ఆలయానికి వచ్చిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తికి దేవస్థానం ఏఈఓ మోహన్, అర్చకస్వాములు, పండితులు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉభయదేవాలయాల్లో ప్రత్యేక పూజలు ముగిశాక అమ్మవారి ఆలయ ప్రాకార మండపంలో హైకోర్ట న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎం.ప్రచాక్ వేదపండితులు వేదాశీర్వచనం వల్లించగా ఏఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.