ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలుగా గుండా నాగ సుప్రజ ఎన్నిక
1 min readరాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల ఆశీస్సులు తీసుకున్న నంద్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం నూతన అధ్యక్షురాలు శ్రీమతి గుండా నాగ సుప్రజ సుప్రజ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నంద్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి గుండా నాగ సుప్రజ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను వారి నివాసంలో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల అధికారి జయంతి వెంకటేశ్వర్లు, నంద్యాల ఆర్యవైశ్య మహాసభకు మహిళా విభాగం నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి నాగ సుప్రజ, ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు బింగుమళ్ల శ్యామ్సుందర్ గుప్తా, భవనాసి నాగ మహేష్, మలిపెద్ది నాగరాజు ,సతీష్ కుమార్, గుండా మురళీధర్, శ్రీరామ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా రాజ్యసభ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న ఆర్యవైశ్య మహాసభ కు నూతన కార్యవర్గంలో ఎన్నికైన వారందరూ మహాసభ ప్రతిష్టను మరింత పెంచే విధంగా పనిచేయాలని కోరారు .నంద్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి గుండా నాగసుప్రజను అభినందించారు. అనంతరం నంద్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి గుండా నాగ సుప్రజ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆశీస్సులతో తాను ఈ పదవికి ఎన్నిక అయినట్లు తెలిపారు .ఆయన ఆశీస్సులు నిరంతరం తమకు ఉండాలని కోరారు అందరినీ కలుపుకొని పోయి ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని వివరించారు.