వైఎస్సార్ పార్టీ యువజన అధ్యక్షుడుగా గుండం నాగేశ్వర రెడ్డి ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో.తన పదవికి సహకరించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి,ఎంపి పోచ బ్రహ్మనంద రెడ్డి గారికి ,జిల్లా అధ్యకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి,జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి గారికి ,యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారికి,జిల్లా ఎమ్మెల్యే లకు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపిన. గుండం నాగేశ్వర రెడ్డి గారుపార్టీ అధిష్టానం మేరకు నా భాధ్యతలు నిర్వర్తిస్తాను ..గుండం నాగేశ్వర్ రెడ్డి గారు నంద్యాల జిల్లా వైఎస్సార్ పార్టీ యువజన సంఘం అధ్యక్షుడుగా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ నాయకుడు మండల వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు గుండం నాగేశ్వర రెడ్డి గారిని,జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శి పేరం సత్యనారాయణ రెడ్డి గారికి జిల్లా వికలాంగుల అధ్యక్షుడు గా పేరా నాగార్జున రెడ్డి గారిని ,జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు గా గోగుల రమణ ను రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం పేర్లను ప్రకటించడం తో బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు . నంద్యాల జిల్లా యువజన సంఘం అధ్యక్షుడుగా ఎన్నికయిన గుండం నాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం లో బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారికి,జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్ర బోతుల పాపిరెడ్డి గారికి ,యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారికి పూల బొకేలు ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ గుండం నాగేశ్వర్ రెడ్డిని జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నియమించడం చాలా సంతోషంగా ఉందని అందుకు ముఖ్యమంత్రి గారికి బనగానపల్లె నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే జిల్లా పార్టీ ప్రచార అధ్యక్షుడుగా పేరం సత్యనారాయణ రెడ్డిని, వికలాంగుల సంఘం అధ్యక్షుడిగా పేరా నాగార్జున రెడ్డిని, చేనేత సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొత్తపేట సర్పంచ్ గోగుల రమణను పార్టీ అధిష్టానం నియమించడం జరిగిందని వారి తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గుండం నాగేశ్వర్ రెడ్డి గురించి అతని వ్యక్తిత్వం గురించి బనగానపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా వైయస్సార్ పార్టీకి ఒక సైనికుని వలె పనిచేసి వైఎస్ఆర్ పార్టీ గెలుపుకు కృషి చేసిన వ్యక్తి అని ఆయనను కొనియాడారు. ఆయన కష్టాన్ని పార్టీ గుర్తించి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా నియమించడం పార్టీలో పని చేసే వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పడానికి గుండం నాగేశ్వర్ రెడ్డి ఒక ఉదాహరణ అని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడుగా, సోషల్ మీడియా కన్వీనర్ గా, గృహసారధుల కన్వీనర్ గా అనేక పదవులు తీసుకొని ఆ పదవులకు న్యాయం చేసిన వ్యక్తి గుడ్డం నాగేశ్వర్ రెడ్డి అని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీలో యువత చాలా చురుగ్గా పనిచేస్తుందని యువతను ముందుకు నడిపిస్తున్న గుండం నాగేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ప్రశంసించారు. మళ్లీ 2024 సంవత్సరంలో యువత బాగా కష్టపడి మన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా, తనను మళ్ళీ శాసనసభ్యులు గా గెలిపించడానికి కృషి చేయాలని సోషల్ మీడియా సభ్యులు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు,బూత్ కమిటీ కన్వీనర్ లు, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులు అందరు కలిసికట్టుగా మళ్లీ బనగానపల్లె నియోజకవర్గం లో వైఎస్ఆర్ పార్టీ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి గారు మాట్లాడుతూ గుండం నాగేశ్వర్ రెడ్డి గారి విశేష సేవలు వైయస్సార్ పార్టీకి అందించడం ద్వారా ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని గుండం నాగేశ్వర్ రెడ్డి చాలా ఉత్సాహవంతమైన యువకుడు అని బనగానపల్లె నియోజకవర్గం అధ్యక్షుడుగా ఆయన బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది అని అలాగే బనగానపల్లె నియోజకవర్గంలో నాయకులకు,కార్యకర్తలకు అనేక పదవులు లభించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇంతవరకు పార్టీ కొరకు కష్టపడిన వారు పదవులు పొందిన వారు జిల్లాలో మరింత కష్టపడి పార్టీ గెలుపుకు కృషి చేయాలని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గంలో జిల్లా పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులుగా ఎన్నికైన గుండం నాగేశ్వర్ రెడ్డి గారికి, పెరం సత్యనారాయణ రెడ్డి గారికి ,పేరా నాగార్జున రెడ్డి గారికి ,గోకుల రమణా గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు మాట్లాడుతూ కష్టపడితే పార్టీ తగిన గుర్తింపు ఇస్తుంది అని చెప్పడానికి నిదర్శనమే మన గుండం నాగేశ్వర్ రెడ్డి అన్నగారని చెప్పారు. పార్టీ కొరకు అహర్నిశలు కష్ట పడ్డ గుండం నాగేశ్వర్ రెడ్డి అన్నగారికి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గుండం నాగేశ్వర్ రెడ్డి అన్నగారు మరెన్నో ఉన్నతమైన పదవులు అధిష్టించాలని తెలిపారు.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ జిల్లా వైయస్సార్ పార్టీ యువజన సంఘం అధ్యక్షుడిగా ఈ పదవి రావడానికి ప్రత్యేక కారణమైన బనగానపల్లె నియోజకవర్గ శాసనసభలు కాటసాని రామిరెడ్డి గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి గారికి, నియోజకవర్గ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి ఒకే ఒకసారి అడగడం జరిగిందని అన్నగారు దృష్టిలో పెట్టుకొని తనకు జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా పదవి వచ్చేటట్లు కృషి చేయడం జరిగిందని చెప్పారు. ఏ నియోజకవర్గంలో లభించని పార్టీ పదవులు మన బనగానపల్లె నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగిందని చెప్పారు. తనకు జిల్లా అధ్యక్షుడిగా పదవి రావడానికి కృషిచేసిన నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులకు తాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పారు. తన మీద నమ్మకంతో పార్టీ ఇచ్చిన పదవి తో 2024 ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ గెలుపుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు భీమిరెడ్డి ప్రతాపరెడ్డి, పసుపల గ్రామ సర్పంచ్ మోహన్, బత్తులూరుపాడు అంబటి రవి రెడ్డి, సోషల్ మీడియా బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్ సాధుల శివశంకర్ రెడ్డి, పాపిరెడ్డి సుదర్శన్ రెడ్డి, కైపా ప్రతాపరెడ్డి, అప్పలాపురం అశోక్ రెడ్డి, బనగానపల్లె పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ కోనేటి దుర్గా, యాగంటి పల్లె శివరామిరెడ్డి,యనకండ్ల రాజశేఖర్ రెడ్డి ,వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.