PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా గుప్తా ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం..

1 min read

– 2022 కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని  సాహితీవేత్త పతంజలిశాస్త్రికి అందజేత..
– హరేకృష్ణ మూవ్మెంట్ ఇండియా వారికి రూ. 25 లక్షలు అందజేసిన
– ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహనగుప్తా
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గుప్తా ఫౌండేషన్ అవార్డుల వేడుక ఆదివారం ఏలూరు వైయంహెచ్ఎ హాలులో ఘనంగా నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజమండ్రికి చెందిన హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా వారికి రూ. 25 లక్షలు డి.డి. అందజేశారు. ఆ ఫౌండేషన్ అందించే కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని 2022 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, పర్యావరణ పరిరక్షకుడు తల్లావజ్ఝల పతంజలిశాస్త్రికి అందజేశారు. ఈ సంద ర్భంగా ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహనగుప్తా కుటుంబ సభ్యులు ఆయన్ను సత్కరించి, రూ.2 లక్షలు విలువైన డీడీ అందజేశారు. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గుప్తా ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ సంస్థ తరపున ఏలూరు అమీనాపేటలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహానికి (నం. 2) రూ.1.25 లక్షల విలువైన ఆర్వో ప్లాంటు, స్మార్ట్ టీవీ అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహనగుప్తా మాట్లాడుతూ 1969లో ఏలూరు కేంద్రంగా ఎగుమతుల వ్యాపారంలో ఉన్నారని, 1989లో ఫౌండేషన్ ను ప్రారంభించామని, 1994లో తన తండ్రి పేర శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రదానాన్ని ప్రారంభించామన్నారు. మూడు దశాబ్దాలకు పైగా గుప్తా ఫౌండేషన్ అసంఖ్యాక సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ప్రజ్ఞామూర్తులు, ఇరవై ఒకరిని సత్కరించామని, సాహిత్యరంగంలో ఇప్పటికీ 19 మంది శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందజేసామని తెలిపారు.ముందుగా మోహన గుప్తా కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈకార్యక్రమంలో చినుకు మాసప త్రిక సంపాదకుడు నండూరి రాజగోపాల్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ , మాజీ మంత్రి మరడాని రంగారావు, ఉషాబాల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఉషా.బాలకృష్ణారావు, జనసేన పార్టీ ఏలూరు నియో జకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనా యుడు ,పలు రంగాలకు చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మేనేజర్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని పరివేక్షించారు.

About Author