ఏలూరులో ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవాలు
1 min read
ఆర్.ఆర్ పేట సాయిబాబా మందిర్ లో పోటెత్తిన భక్తులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గురుపౌర్ణమి సందర్భంగా ఏలూరులోని పలు సాయి దేవాలయాల్లో మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో డివిజన్లోని పలువురు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సాయిబాబా ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 38వ డివిజన్ శంకరమఠం రోడ్డు రామచంద్రరావు పేటలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో కాకడ హారతుల వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు నగర ప్రముఖులు సందర్శించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పల్లకీ ఉత్సవంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘంటసాల మల్లికార్జునరావు “శిరిడి సాయిబాబా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలి ఆశీర్వదించారు. విచ్చేసిన భక్తులు అన్న ప్రసాద వితరణ దానం చేయడం గొప్ప పుణ్యఫలం. గురుపౌర్ణమి రోజున బాబా వారికి అంకితం చేయడం ఎంతో పవిత్రమైన కార్యం. ఇలాంటి మహత్తర కార్యక్రమాలను సమర్పణతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలకు అభినందనలు” అన్నారు. ఈ మహోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని, సాయి నామస్మరణతో పుణ్యస్నానం పొందారు. ఈ సందర్భంగా నగరంలోని సాయిబాబా దేవాలయాల పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాo కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
