PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండలో మంగళవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీగా వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులతో దాదాపు అరగంట పాటు వడగళ్ల వర్షం కురిసింది. వడగళ్ల వర్షం దాటికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి కరెంటు తీగలపై పడడంతో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేవలం పత్తికొండ పరిధిలోనే వడగళ్ల వర్షం పడింది. చుట్టుపక్కల గ్రామాల్లో వర్షం జాడ కానరాలేదు. కేవలం పత్తికొండ పరిసర ప్రాంతాల్లోని భారీగా వర్షం కురవడంతో మురికి కాలువలు పొంగిపొర్లాయి. పట్టణ పురవీధుల్లో వర్షపు నీరు చేరి వంకలను తలపించాయి. ఈ కారణంగా పట్టణంలో ట్రాఫిక్ కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి మురికి నీరు చేరి కాలనీవాసులు నానా అవస్థలు పడ్డారు.

About Author