NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీకి కొత్త అర్థం చెప్పిన జీవిఎల్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు వైసీపీకి కొత్త అర్థం చెప్పారు. వైసీపీ అంటే ఏమీ చేత‌గాని ప్ర‌భుత్వ‌మ‌ని ఎద్దేవా చేశారు. వైకాపా ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇస్తున్నా రాష్ట్రం సద్వినియోగం చేసుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌ర్వాత ఏపీకి ఎక్కువ నిధులు కేంద్రం ఇచ్చింద‌ని తెలిపారు. ఓటీఎస్ పేరుతో కొత్త త‌ర‌హా దోపిడీకి తెర‌లేపార‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆర్థిక వైఫ‌ల్యానికి ఓ కేస్ స్ట‌డీలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి త‌యారైంద‌ని అన్నారు.

About Author