ఘనంగా హఖిమ్ అజ్మల్ ఖాన్157వ జన్మదినం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/9-11.jpg?fit=550%2C1065&ssl=1)
యునాని వైద్యం యొక్క ఆరోగ్యం,ప్రాముఖ్యతను వివరించిన డాక్టర్ కె.కల్పనా కటాక్షం
65 మందికి వైద్యపరీక్షలు, ఉచిత మందులు పంపిణీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: స్ధానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని యునాని వైద్యశాలలో జాతీయ యునాని డే సందర్బంగా మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు యునాని వైద్యాధికారి డా:జి. రఘునాధ్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రాంతీయ ఉపసంచాలకులు డా. కె. కల్పనాకటాక్షం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ యునాని వైద్యంయొక్క ప్రాముఖ్యను గూర్చి వివరించారు. అనంతరం 65 మందికి వైద్య సేవలు అందించారు. కార్యక్రమానికి ముందు హఖీమ్ అజ్మల్ ఖాన్ 157వ జన్మదినం సందర్బంగా నివాళులు అర్పించారు.కార్యక్రమంలో బుట్టాయిగూడెం వైద్యాధికారి డా:జి. ప్రియదర్శిని, డా. కె.ఎల్. సుభధ్ర, డా:కె.రాణి, వైద్య సిబ్బంది ఎం.కె. జమ, బ్రహ్మానందం, పెర్శిమణి, తదితరులు పాల్గొన్నారు.