హలీమ్ కు అరుదైన గుర్తింపు
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ బిర్యానీ మాదిరిగా నగరానికి మరో స్పెషల్ గా మారిన హలీమ్ కు ఇప్పుడు తాజాగా అరుదైన గుర్తింపు దక్కింది. మోస్ట్ పాప్యులర్ జీఐగా హైదరాబాద్ హలీం ఎంపికైంది. రసగుల్లా, బికనీర్ భుజియా వంటి 17 వంటకాలను వెనక్కు నెట్టిన హలీమ్ ఈ అవార్డును అందుకుంది. భారతీయులతో పాటు విదేశీయులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హలీమ్ ను మోస్ట్ పాప్యులర్ జీఐ అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాద్ హలీమ్ కు 2010లోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మోస్ట్ పాప్యులర్ జీఐ అవార్డును గతంలోనూ హైదరాబాద్ హలీమ్ ఓ దఫా చేజిక్కించుకుంది.