హమారా ఘర్ నిర్వాహకునికి జర్నలిస్టుల అండ
1 min read–పదివేల ఆర్థిక సహాయం అందజేసిన జర్నలిస్టులు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: హమారా ఘర్ ఆశ్రమ నిర్వాహకుడికి జర్నలిస్టులు అండగా ఉంటారని సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న అబు రిజ్వాన్ను ఏపీ యు డబ్ల్యూ జే యూనియన్ నాయకులు పరామర్శించి ఆయన వైద్య చికిత్సల నిమిత్తం పదివేల ఆర్థిక సహాయం నగదును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ హమారా ఘర్ ఆశ్రమం నిర్వహిస్తూ అనేకమంది నిరుపేదలకు ఆశ్రమం కల్పించడమే కాకుండా విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో తన వంతు కృషి చేయడం ఎంతో అభినందనీయమని నేటి సమాజంలో అలాంటి సేవా దృక్పథం ఉన్న మహనీయుడు అబు రిజ్వాన్ అని అనేకమందికి బాగోగులు చూస్తూ అండగా నిలిచే ఆయనకు అనారోగ్యం గురై గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న పాత్రికేయులు ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పాత్రికేయుల సహాయ సహకారులను ఆయనకు అందజేసి ఆయన త్వరగా కోలుకొని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునాలని అన్నారు. భవిష్యత్తులో ఆయన చేపట్టే సేవా కార్యక్రమంలో కూడా జర్నలిస్టు సంఘం తరఫున తోచిన సహాయం అందిస్తూ సేవలందిస్తామని సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరామర్శించిన వ్యక్తుల్లో సీనియర్ పాత్రికేయులు ఏపీయూడబ్ల్యూజే సంగం జిల్లా నాయకులు ఐజేయు కే నాగరాజు, సుబ్బయ్య, కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగరాజుగౌడ్ , ఉపాధ్యక్షులు దస్తగిరి ,హుస్సేన్ ,వెంకటరమణ, మొల్ల భాష , గౌండ హుస్సేన్ భాష మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.