దొరికిన సెల్ ఫోన్ ను బాధితుడికి అప్పగింత
1 min read
నిజాయతీని చాటుకున్న మక్బూల్ ను అభినందించిన …. కర్నూల్ డిఎస్పీ జె.బాబు ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారం కర్నూల్ పాత బస్టాండ్, పెద్ద పడకన కు చెందిన మక్బూల్ మసీదుకి పోయి నమాజ్ చేసుకొని వస్తూ ఉంటే దారిలో ఒక మొబైల్ ఫోన్ దొరికింది.కర్నూలు , ఎర్రబురుజుకి చెందిన మహేశ్వర ఆచారి ఓల్డ్ ఆంధ్రబ్యాంకు దగ్గర తన పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు మొబైల్ పోగొట్టుకున్నాడు.బాధితుడు మహేశ్వర ఆచారి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. బాధితుడైన మహేశ్వ ఆచారిని కర్నూలు డిస్పీ కార్యాలయానికి పిలిపించి కర్నూల్ డిఎస్పీ జె.బాబు ప్రసాద్ చేతుల మీదుగా మొబైల్ ఫోన్ ను అందజేశారు. నిజాయతీని చాటుకున్న మక్బూల్ ను కర్నూల్ డిఎస్పీ జె.బాబు ప్రసాద్ అభినందించారు.