PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హ్యాండ్ బాల్ పోటీల లోగోను ఆవిష్కరించిన  డా. శంకర్ శర్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈనెల 9 10వ తేదీల్లో స్థానిక ఆదర్శ విద్యా మందిరంలో జరగనున్న 52వ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పురుషుల ఛాంపియన్షిప్  లోగో ను గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ ఆవిష్కరించారు.శుక్రవారం స్థానిక గాయత్రి ఎస్టిలోని గురుదత్త క్లినిక్ లో ఏర్పాటుచేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి. శ్రీనివాసులు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, క్రీడా సంఘ ప్రతినిధులు టి గంగాధర్, కొండపోగు చిన్న సుంకన్న, నాగ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ పోటీలో నిర్వహణ కష్టతరమని అటువంటి కష్టతరమైన పనిని ఇష్టంతో విజయవంతం చేయడం హర్షనీయమన్నారు. ఇటువంటి పోటీలో పాల్గొని క్రీడాకారుల విద్యా ఉద్యోగాల్లో లభించే అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. వేగవంతమైన క్రీడల్లో హ్యాండ్ బాల్ ను క్రీడాకారులు ఎంచుకోవడం చాలా సంతోషం అన్నారు ఇందులో సంపూర్ణ ఆరోగ్య వికాసానికి అవకాశాలు ఉన్నాయి.

About Author