PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేతి వృత్తులను పరిరక్షించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:చేతివృత్తిదారుల పరిరక్షించాలని ఏపీ వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా సీనియర్ నాయకులు జి, రామకృష్ణ కన్వీనర్ సి.గురుశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్మిక కర్షక భవన్లో చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ సమావేశం చేనేత కార్మిక  కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వృత్తి దారుల సమన్వయ కమిటీ సీనియర్ నాయకులు జి, రామకృష్ణ, సి.గురు శేఖర్ లు మాట్లాడుతూ సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల వృత్తులన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అన్నారు. ప్రభుత్వ పాలకులు అధికారులు వృత్తిదారుల పట్ల వివక్షత చూపుతున్నారని కావున చేతి వృత్తిదారులందరూ ఐక్యమై  పోరాటాలు నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనివారు తెలియజేశారు. క్షౌర వృత్తిలోకి రిలయన్స్ బడా కార్పొరేట్ అంబానీ సంస్థలు క్షౌర వృత్తిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. దీనివలన లక్షలాది మంది సాంప్రదాయ వృత్తిదారులకు జీవనోపాధి కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చేనేతకు అవసరమయ్యే పదకొండు రకాల రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, చేనేత ముడి సరుకులు వస్త్రాలపై జీఎస్టీ విధించడం వలన చేనేత వృత్తి కోల్పోయి వృత్తిదారులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. సామాజిక సేవ వృత్తిగా ఉన్నటువంటి రజక వృత్తిదారులపై గ్రామ బహిష్కరణలు, సాంఘిక బహిష్కరణలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. వీటి నివారణ కొరకు ఎస్సీ ఎస్టీ తరహాలో సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అన్నారు. వృత్తి పరిరక్షణ కొరకు జీవో నంబర్ 343 ప్రకారం చెరువులు, కుంటలను కబ్జా కాకుండా రజక వృత్తిదారులకే కేటాయించి వాటిని పరిరక్షించాలని కోరారు. గొర్రెల మేకల పెంపకదారుల సమస్యలు  చాలా తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పోరంబోకు భూమిలో ఉన్న అటవీ భూములలో వాటిని మేపుకొనుటకు అవకాశం కల్పించాలని కోరారు. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో గొర్రెల దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సమావేశంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముక్కన్న,ఉపాధ్యక్షులు శేషాద్రి సహాయ కార్యదర్శి జయమ్మ శ్రీనివాసులు చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె. లక్ష్మన్న , సహాయ కార్యదర్శి కాలప్ప, వీరన్న, జిల్లా కమిటీ సభ్యులు వీరేష్, గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా నాయకులు ఎర్ర మద్దిలేటి, మద్దిలేటి, గిడ్డయ్య మరియు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు రవికుమార్ , వెంకటేశ్వర్లు. బెలగల్ రామకృష్ణ. పర్ల వెంకటేశ్వర్లు. గూడూరు అశోక్. అల్లిసా. సురేంద్ర. కోడుమూరు శివన్న.తదితరులు పాల్గొన్నారు.

About Author