కారుణ్య నియామక పత్రాలు అందజేత
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం కర్నూలు నగరపాలక సంస్థ నందు పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తూ డిసెంబర్ 21, 2023న అనారోగ్యంతో మరణించిన పి.మాదక్క కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ కమిషనర్ యస్.రవీంద్ర బాబు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నగరపాలక కార్యాలయంలో కమిషనర్ మాదక్క కుమారుడు పంభ శేఖర్‌కు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.