గృహహక్కు పత్రం అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్, మిడుతూరు: మండల కేంద్రమైన మిడుతూరుకు చెందిన మౌలబి జగనన్న గృహ హక్కు పత్రం కొరకు 10,000 చెల్లించినందున మౌలాబి కి గృహ హక్కు పత్రం ఎంపిడిఒ నాగ శేషాచల రెడ్డి, తహశీల్దారు సిరాజుద్దిన్ అందజేశారు. 1983 సంవత్సరం నుండి ప్రభుత్వం నుండి గృహాలు నిర్మించుకున్న ప్రతి ఒక్కరూ కూడా 10,000 చెల్లించి గృహ హక్కు పత్రాన్ని పొందవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహమ్మద్ హుస్సేన్, పంచాయితీ కార్యదర్శి శివ కళ్యాణ్ సింగ్, వర్క్ ఇన్స్పెక్టర్ భాష, సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి పాల్గొన్నారు.