హంద్రీ నీవా పంట కాలువల నిర్మాణం చేపట్టాలి..
1 min read– హంద్రీ నీవా పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ ప్రాంతంలో పందికోన రిజర్వాయర్ కింద వంటకాలువలను నిర్మాణాలు పూర్తి చేసి కాలువల ద్వారా నీటిని అందించాలని సిపిఎం జిల్లా నాయకులు బి. వీర శేఖర్ డిమాండ్ చేశారు. దేవనకొండ మండలంలో సాగునీటి అవసరాల కోసం పంట కాల్వల నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరారు. మండల రైతంగానికి సాగు నీరు ఇవ్వాలని పంట కాల్వల నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తిందని, ప్రభుత్వ వైఖరినీ సిపిఎం పార్టీ నిరసిస్తుందని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్, మండల నాయకులు అశోక్, సూరి, పత్తికొండ మండల నాయకులు సురేంద్ర లు పేర్కొన్నారు.జిల్లా సమగ్రా భివృద్ది కొరకు ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదోని నుండి కర్నూలు వరకు చేపట్టిన మహాపాదయాత్రను జయప్రదం చేయలని ఈ సందర్భంగాా కోరారు. పంట కాలువలు నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని పాలకుర్తి, గుమ్మరాళ్ల ,బి సెంటర్, ,గేద్దరాళ్ళ, పల్లె దొడ్డి, కరివేముల, ఓబులాపురం , జిల్లేడు బుడకల ,కప్పట్రాళ్ల, నెల్లిబండ, బండగట్టు ,ఈదుల దేవరబండ ,కోటకొండ ,బేతపల్లి బంటుపల్లి గుండ్లకొండ, గుడిమరాళ్ల, నల్లచెలిమీల గ్రామాలలో జీపు జాత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాయలసీమ కరువుకు పరిష్కారంగా అనేక పోరాటాల నేపథ్యంలో పోరాడినసాధించుకున్న హంద్రీనీవా ఇప్పటికీ పూర్తి కాకపోవడం ప్రజా సమస్యల పట్ల పాలకుల చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. 16 సంవత్సరాలుగా హంద్రీనీవా పనులు కొనసాగుతున్న హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేయడంలో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని అన్నారు. పందికోన రిజర్వాయర్ నుండి దేవనకొండ మండలానికి 46వేల ఎకరాలకు సాగు స్థిరీకరణ అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అధికారికంగా నేటికీ ఒక్క ఎకరా కూడా నీరు ఇవ్వకపోవడం శోచనీయం. పందికోనరిజర్వాయర్నుండిసాగుకుద్దేహించబడిన ప్రధాన కాలువ నేటికి కరివేముల తెర్నేకల్ గ్రామల మధ్య పెండింగ్లో ఉండడం, అదేవిధంగా 46 వేల ఎకరాలకు సాగునీరు అందించే పంట కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడం మండల ప్రజానీకం పైన ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు బాధ్యతారహితంగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం అన్నారు. హంద్రీనీవా కాలువ నిర్మాణంలో , పెండింగ్ పనులు పూర్తి చేయకపోవడం మండల రైతాంగానికి శాపంగా పరిణమించింది అనిి అన్నారు. వెంటనే హంద్రీనీవా మొదటి దశలు ప్రాజెక్టుటు పనులు పూర్తి చేసి, పంట కాలవలు నిర్మాణం పూర్తి చేసి దేవనకొండ మండలం కు రావలసిన సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే అనేక రూపాల్లో పంట కాల్వల నిర్మాణం కోసం సిపిఎం అనేేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహించిందనిి అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలనిి, తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పంట కాల్వల నిర్మాణం పూర్తి వరకు కృషి చేద్దామని సిపిఎం పార్టీ కోరుతుంది, అదేవిధంగా గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాటు చేయడం ద్వారా హంద్రీ నీవా పైతట్టు గ్రామాలైన గుండ్లకొండ నుండి కోటకొండ, మాచాపురం వరకు అన్ని గ్రామాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. గుండ్లకొండ దగ్గర స్లోయిస్ చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని తెలిపారు. అదేవిధంగా మండలంలోని చెరువులఎన్నటికీ హంద్రీ నీవా ద్వారా నీళ్లు మళ్లించాలని కోరారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మరో ప్రక్క ప్రమాదాలకు నెలవై ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు అంతర్గత రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కోటకొండలో పిహెచ్ సీ ఏర్పాటు చేయాలని మరియు పొట్ల పాడు దగ్గర హంద్రీ పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మండల ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరారు. ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయిన హంద్రీ బ్రిడ్జి నిర్మాణం తక్షణమేచేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ ప్రకటించిన పంటల బీమా పథకంలో పత్తికి బీమా లేకపోవడం వలన మండల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందనిి, మండలంలో పత్తి పంట విస్తారంగా పండించిన నేపథ్యంలో పత్తికి పంటల బీమా వర్తింపజేయాలనీ కోరారు. పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సాగు నుండి పెండింగ్ ప్రాజెక్టుుగా ఉన్నటువంటి వేదవతి, హంద్రీనీవా,గుండ్రేవుల ,ఆర్డీఎస్ కుడి కాలువ ,గురు రాఘవేంద్ర తదితర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా జిల్లాని సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉందని కావున దశాబ్దాల తరబడి పాలకులు ప్రజలను మభ్య పెడుతున్న ఈ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బజారి, మహబూబ్ బాషా, శ్రీనివాసులు, వీరన్నన, వీరేంద్ర ఓంకార్, అనిల్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.