హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు చేపట్టాలి..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/5-7.jpg?fit=550%2C248&ssl=1)
రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ పనులను పూర్తి చేసేందుకు తగిన నిధులు కేటాయించాలి…
ఎడమ కాలువను పొడిగించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేసి సాగు, తాగునీరు అందించాలి… పి. రామచంద్రయ్య, బి. గిడ్డయ్య.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య డిమాండ్ చేశారు. శనివారం స్థానిక శాంతి టాలెంట్ స్కూల్ లో అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల తిరుపాల్, వైసీపీ మండల కన్వీనర్ కారం నాగరాజు, మాజీ సర్పంచ్ సోమశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబి రసూల్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారన్న, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మయ్య, ఏఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఉమాపతి, బి. సురేంద్ర కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ హుస్సేన్, లోక్ సత్తా పార్టీ నాయకులు జయరాం లు హాజరై ప్రసంగించారు.ఈసందర్భంగా పి. రామచంద్రయ్య, బి. గిడ్డయ్య లు మాట్లాడుతూ, హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల 25 వేల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల జనాభాకు తాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న హంద్రీనీవా ప్రాజెక్ట్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా విఫలమైందని విమర్శించారు.