వచ్చే జూన్ నాటికి హంద్రినీవా ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
1 min read
అధికారులను ఆదేశించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
పత్తికొండ, న్యూస్ నేడు: వచ్చే జూన్ నాటికి హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి నేటి సామర్థ్యం పెంచేందుకు చేయాల్సిన పనులు యుద్ధ ప్రాతి పదికన పూర్తి పూర్తిచేయాలని రాష్ట్రజలవనరుల శాఖ మంత్రి నిమ్మలరామానాయుడు అధికారులను ఆదేశించారు. అందరినీవా ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు మంగళవారం రాష్ట్ర జలవనిమ్మ శాఖా మధ్యలో నిమ్మల రామానాయుడు మంగళవారం పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కే.ఈ శ్యాం కుమార్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పత్తికొండ బైపాస్ లో గల వినాయక ఘాటు వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులను స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ తో కలిసి మంత్రి పనులు పరిశీలించారు. దుదే కొండ గ్రామ శివారు పరిధిలోని హంద్రీనీవా ప్రధాన కాలువ కిలోమీటర్ 114 వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద జల వనరుల శాఖ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, వచ్చే జూన్ నాటికి హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి తక్షణం చేయాల్సిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సంబంధించి జీవనాడి అయిన హంద్రీ నీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. అందువల్లనే రాష్ట్రంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు రూ.3243 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు.
