ఊపందుకున్న హన్సిక కెరీర్..
1 min readసినిమా డెస్క్ : ‘దేశముదురు’ భామ హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘105 మినిట్స్’. బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజు దుస్స దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిన్న ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా హన్సిక సోషల్ మీడియాలో రివీల్ చేసింది. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. ఎలాంటి కట్స్ లేకుండా సింగిల్ షాట్‌లో ఈ సినిమా మొత్తాన్ని తీస్తున్నారు. అంతేకాదు సినిమాలో హన్సిక క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. టైటిల్‌కి తగ్గట్టే 105 నిముషాల నిడివితో ఈ సినిమా ఉంటుందట. ఓ ఇంట్లో ఇరుక్కుపోయిన హీరోయిన్‌కి ఎదురైన కష్టాలే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఇక తమిళంలో ‘మహా’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో తన కెరీర్‌లో యాభై సినిమాలు పూర్తి చేసింది హన్సిక. తాజాగా తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శృతి’ పేరుతో ఓ సినిమా స్టార్ట్ చేసింది. ఇది కూడా థ్రిల్లర్ మూవీనే. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో హన్సిక కెరీర్‌ను మళ్లీ ఊపందుకున్నట్టు అనిపిస్తోంది.